Jobs: ఫ్రెషర్స్‌కి పండగలాంటి వార్త.. 20 వేల ఉద్యోగులను తీసుకోనున్న టెక్‌ దిగ్గజం

|

Jul 19, 2024 | 4:02 PM

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థికమాంద్యం భయాలు ఉన్నాయి. ఉద్యోగాల కల్పన భారీగా తగ్గింది. కొత్త ఉద్యోగాల మాటేమో కానీ ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఇదే పరిస్థితులు ఉన్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రెషర్స్‌ ఇబ్బందులు పడుతున్నాయి. ఐఐటీల్లో కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెట్స్‌ నిర్వహించకపోవడం...

Jobs: ఫ్రెషర్స్‌కి పండగలాంటి వార్త.. 20 వేల ఉద్యోగులను తీసుకోనున్న టెక్‌ దిగ్గజం
Jobs
Follow us on

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థికమాంద్యం భయాలు ఉన్నాయి. ఉద్యోగాల కల్పన భారీగా తగ్గింది. కొత్త ఉద్యోగాల మాటేమో కానీ ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఇదే పరిస్థితులు ఉన్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రెషర్స్‌ ఇబ్బందులు పడుతున్నాయి. ఐఐటీల్లో కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెట్స్‌ నిర్వహించకపోవడం ఆందోళన కలిగించింది. ఇక కొన్ని కంపెనీలు ఫ్రెషర్స్‌ను సెలక్ట్ చేసుకొని రిక్రూట్‌మెంట్ లెటర్స్‌ కూడా ఇవ్వని పరిస్థితి.

అయితే ఇలాంటి నెగిటివ్‌ వార్తల మధ్య భారత్‌కు చెందిన టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మంచి గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 15 నుంచి 20 వేల మంది ఫ్రెషర్లను నియమించాలని భావిస్తున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు. కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘరాజ్కా మాట్లాడుతూ, ‘ఈ ఏడాది కొత్తగా 15 నుంచి 20 వేల మందిని నియమించాలనుకుంటున్నాం. గత కొన్ని నెలలుగా నియామకాల విషయంలో కంపెనీ నిరంతరం వృద్ధి చెందుతోంది’ అని చెప్పుకొచ్చారు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ నియామకాలను చేపట్టేందుకు ఇన్ఫోసిస్‌ సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యను 2000కి తగ్గించింది. ఇది గత త్రైమాసికాల కంటే తక్కువని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సామర్థ్యాన్ని దాదాపు 85 శాతానికి నింపినట్లు తెలిపారు. అయితే తాజాగా వచ్చిన ప్రాజెక్టులతో మరికొంత మందిని రిక్రూట్ చేసుకునే ఆలోచనతో ఉందని తెలిపారు.

ఇదిలా ఉంటే 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏకంగా 40,000 మంది కొత్త గ్రాడ్యుయేట్‌లను నియమించుకోవాలని యోచిస్తోంది . కంపెనీ మొదటి త్రైమాసికంలో సుమారు 11,000 మంది ట్రైనీలను చేర్చుకుంది. మరోవైపు, ఇన్ఫోసిస్‌లో మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 1,908 తగ్గింది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇది వరుసగా ఆరో త్రైమాసికం కావడం గమనార్హం. దీనికి విరుద్ధంగా, TCS మొత్తం 5,452 కొత్త ఉద్యోగులను చేర్చుకుంది.

మార్చి నెలతో పోల్చితే టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్యను 1,759 తగ్గించింది. అయితే HCL టెక్నాలజీ మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ మొదటి త్రైమాసికంలో ఏకంగా 8080 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ ఈ త్రైమాసికంలో 284 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇదిలా ఉంటే త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో, ఇన్ఫోసిస్ షేర్లు 5% పెరిగి బిఎస్‌ఇలో రికార్డు స్థాయి రూ.1,843కి చేరాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..