EXIM Bank Recruitment 2022: గుడ్‌న్యూస్‌! ఎగ్జిమ్ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (India Exim Bank) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల (Management Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

EXIM Bank Recruitment 2022: గుడ్‌న్యూస్‌! ఎగ్జిమ్ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
India Exim Bank

Updated on: Feb 25, 2022 | 3:55 PM

India Exim Bank Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (India Exim Bank) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల (Management Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 25

పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

వయోపరిమితి: సెప్టెంబర్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 25 ఏళ్లు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులను ఇంట్వ్యూకి పిలుస్తారు.

రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్లకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. మొత్తం 200 మార్కులకుగాను 150 నిముషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లీష్‌ మాధ్యమంలో ఉంటాయి.

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌లో పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్‌/ ఇతర అభ్యర్ధులకు: రూ.600
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BECIL Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 96 ఉద్యోగాలు.. 3 రోజులే గడువు!