INCOIS Recruitment: హైదరాబాద్‌ ఇన్‌కాయిస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

|

Apr 24, 2022 | 2:17 PM

INCOIS Recruitment: భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న...

INCOIS Recruitment: హైదరాబాద్‌ ఇన్‌కాయిస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Incois Recruitment
Follow us on

INCOIS Recruitment: భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సైంటిఫిక్‌ పర్సనల్‌ (31), టెక్నికల్‌ పర్సనల్‌ (20) ఖాళీలు ఉన్నాయి.

* సైంటిఫిక్‌ పర్సనల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పీహెచ్‌డీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ లేదా, కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

* టెక్నికల్‌ పర్సనల్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బీఎస్సీ డిగ్రీ/ కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీలో ఉత్తీర్ణత పొందాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

* వాన్‌ ఇంటర్వ్యూలను మే 04, 05 తేదీల్లో ఇన్‌కాయిస్‌, ఆడిటోరియం, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 39,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Telangana: వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు.. నగదు బ్యాగ్ లాక్కున్నారు.. కట్ చేస్తే..

మనుషుల్ల పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న కుక్కలు..

Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచలన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..