IMSc Jobs: నెలకు రూ.62,000ల జీతంతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్ (IMSc Chennai).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Post) భర్తీకి..

IMSc Jobs: నెలకు రూ.62,000ల జీతంతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Imsc

Updated on: Mar 16, 2022 | 10:00 AM

IMSc Chennai Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్ (IMSc Chennai).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 27

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2, రీసెర్చ్‌ అసోసియేట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: మార్చి 25, 2022నాటికి అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 26,500ల నుంచి రూ.62,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ/బీఎస్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎమ్‌ఏ/ఎంఫిల్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంటెక్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. గేట్‌/జెస్ట్‌/సీఎస్ఐఆర్‌-నెట్‌లో అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మార్చి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEML Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..