IIT Kharagpur: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..

|

Jan 21, 2022 | 5:09 PM

IIT Kharagpur: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఖ‌ర‌గ్‌పూర్‌లోని క్యాంప‌స్‌లో నాన్ టీచింగ్ పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IIT Kharagpur: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..
Follow us on

IIT Kharagpur: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఖ‌ర‌గ్‌పూర్‌లోని క్యాంప‌స్‌లో నాన్ టీచింగ్ పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ (03), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (02), అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ (03) ఖాళీలు ఉన్నాయి.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోని ఆ త‌ర్వాత హార్డ్ కాపీల‌ను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ.56,100 – 1,77,500, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెలకి రూ.56,100 – 1,77,500, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ పోస్టుల‌కు నెలకి రూ.56,100 – 1,77,500 జీతంగా చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 30-01-2022, హార్డ్ కాపీల‌ను పంప‌డానికి 07-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* హార్డ్ కాపీల‌ను ది డిప్యూటీ రిజిస్ట్రార్‌, ఐఐటీ ఖరగ్‌పూర్ – 721302 అడ్ర‌స్‌కు పంపించాలి.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Viral: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

Trending News: ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ కు నో చెప్పిన పైలెట్.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

AP: వినుకొండలో బయటపడిన పురాతన లోహపు రాళ్లు.. గుప్త నిధులంటూ ప్రచారం.. చివరకు