IIT Kharagpur: నెట్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికలు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు..వివరాలివే!

|

Feb 28, 2022 | 9:36 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IIT Kharagpur: నెట్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికలు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు..వివరాలివే!
Iit Kharagpur
Follow us on

IIT Kharagpur JRF Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF)

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, బయోసైన్స్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 31, 000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వ్యాలీడ్‌ నెట్‌/గేట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CBI Jobs: 535 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..