IIT Hyderabad Jobs: లాస్ట్‌ డేట్‌.. ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. అప్లై చేశారా.?

|

Sep 19, 2022 | 9:45 AM

IIT Hyderabad Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ శివారుల్లోని సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పలు విభాగాల్లో ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

IIT Hyderabad Jobs: లాస్ట్‌ డేట్‌.. ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. అప్లై చేశారా.?
Iit Hyderabad
Follow us on

IIT Hyderabad Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ శివారుల్లోని సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పలు విభాగాల్లో ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (19-09-2022) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో చీఫ్‌ లైబ్రరీ ఆఫీసర్‌ (01), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (01), టెక్నికల్‌ ఆఫీసర్‌ (04), సెక్షన్‌ ఆఫీసర్‌ (01), అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎల్రక్ట్రికల్‌) (01), టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (04), జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) (02), ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (02), జూనియర్‌ టెక్నీషియన్‌ (09), మల్టీ స్కిల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌1 (06) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (19-09-2022) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..