IIM Bodh Gaya Teaching Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బోధ్ గయలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Bodh Gaya).. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
విభాగాలు: ఎకనమిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్ జనరల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 57,000ల నుంచి రూ.2,20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: అసిస్టెంట్ పోస్టులకు బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.