IIM Recruitment: అమృత్‌సర్‌ ఐఐఎంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

|

Oct 03, 2021 | 7:11 AM

IIM Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ఈ క్యాంపస్‌లో..

IIM Recruitment: అమృత్‌సర్‌ ఐఐఎంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us on

IIM Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ఈ క్యాంపస్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అడ్వైజర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) – 01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (10) భర్తీ చేయనున్నారు.

* అడ్వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ / కాస్ట్‌ అకౌంటెంట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతో పాటు మూడేళ్ల అనుభవం తప్పనిసరి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు గాను ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌, స్ట్రాటజీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం రిసెర్చ్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అడ్వైజర్‌ పోస్టులకు అక్టోబర్‌ 14, అసిస్టెంట్‌ ప్రొఫెషర్‌ పోస్టులకు అక్టోబర్‌ 24ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కి చివరి తేదీ ఎప్పుడంటే..

IDBI Bank AM Result 2021: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.