Govt Jobs: రూ.2 లక్షలకుపైగా జీతంతో IIITMలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరు..

|

Oct 07, 2022 | 3:26 PM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోనున్న అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.. 56 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి..

Govt Jobs: రూ.2 లక్షలకుపైగా జీతంతో IIITMలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరు..
IIITM Gwalior
Follow us on

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోనున్న అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.. 56 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎస్‌ఈ, ఐటీ, ఈఈఈ, ఎంఎస్‌, ఏఎస్‌ (మ్యాథ్స్‌) విభాగాల్లోని సంబంధిత స్పెషలైజేషన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపిచవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ ఇతర రిజర్వుడ్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి జీతభత్యాలు ఈ కింది విధంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జీతభత్యాల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,59,100ల నుంచి రూ.2,20,200
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,39,600ల నుంచి రూ.2,11,300
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1) పోస్టులకు నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,67,400
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2) పోస్టులకు నెలకు రూ.68,900ల నుంచి రూ.1,17,200
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-3) పోస్టులకు నెలకు రూ.57,700ల నుంచి రూ.98,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: The Registrar (I/C), ABV – Indian Institute of Information Technology and Management Gwalior Morena Link Road, Gwalior, Madhya Pradesh, India – 474015.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.