IIIT Lucknow: ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో ఐఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ చదువుతోన్న అభిజిత్ ద్వివేది బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రఖ్యాత అమెజాన్ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. ఇంతకీ అతని వేతనమెంతో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.1.2 కోట్లు. యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన అభిజిత్ ఇంజినీరింగ్ (ఐటీ) చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అప్పుడే ప్రతిష్ఠాత్మక సంస్థలో.. అందులోనే కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం సంపాదించడంతో అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నారు. అభిజిత్ త్వరలోనే ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లోని అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా జాయిన్ కానున్నాడు.
సాఫ్ట్‌స్కిల్క్ తో పాటు బాడీలాంగ్వేజ్ కూడా..
ఈ సందర్భంగా ప్రసంగించిన అభిజిత్ తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు ‘ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూల గురించి మా సీనియర్ విద్యార్థులతో చర్చించాను. వారి నుంచి విలువైన చిట్కాలు పొందాను. అలాగే యూట్యూబ్‌లో పలు ఇంటర్వ్యూ వీడియోలు చూశాను. ఇంజినీరింగ్ చదివేవారికి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోతుందని చాలామంది భావిస్తారు. అయితే దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌ఎంతో అవసరం. అదేవిధంగా ఇంటర్వ్యూ సమయంలో మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ముఖ్యం. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించవారు వివిధ జాబ్‌పోర్టల్స్ లో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలి. దీనివల్ల ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉంటాయో సులభంగా తెలిసిపోతాయి ‘ అని చెప్పుకొచ్చాడు ఈ ఇంజినీరింగ్ స్టూడెంట్.
Also Read: Honda: ద్విచక్ర వాహన ధరలు పెంచిన హోండా.. యాక్టివా, షైన్ కొత్త ధరలు తెలుసుకోండి..!
Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!
Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!