IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

|

Feb 11, 2022 | 4:09 PM

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈనెల..

IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Ignou
Follow us on

IGNOU January 2022 Session Admission Last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 21 వరకు స్పీకరించనున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఇగ్నో పేర్కొ్ంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in లేదా ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిలో అందించే ఓపెన్, డిస్టెన్స్ మోడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్‌ను చేసుకుని, అన్ని వివరాలను నమోదు చేసి, ఏ కోర్సులో అడ్మిషన్‌ కావాలని భావిస్తున్నారో దానిని ఎంచుకోవాలి. ఇగ్నో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీలు, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, అప్రీషియేషన్‌/అవేర్‌నెస్ లెవల్‌ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ విభాగాల్లో మొత్తం 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను వర్సిటీ అందించింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం ఇగ్నో అధికారిక సైట్‌ignou.ac.inను తనిఖీ చేయవచ్చు.

Also Read:

BARC Recruitment 2022: BARCలో గ్రూప్ A పోస్టులకు చివరి తేదీ పొడిగింపు..ఇంజినీరింగ్‌ చేసినవారికి అవకాశం!