ICAR Recruitment: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగానే మొత్తం 462 ఖాళీలను భర్తీ చేయడానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్-ఐకార్ ఇన్‌స్టిట్యూట్స్ 391 (జనరల్ 235, ఓబీసీ 79, ఈడబ్ల్యూఎస్ 23, ఎస్సీ 41, ఎస్టీ 13, పీడబ్ల్యూడీ 5), అసిస్టెంట్-హెడ్‌క్వార్టర్ 71 (జనరల్ 44, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 7, ఎస్టీ 1, పీడబ్ల్యూడీ 3) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 07-05-2022న మొదలై 01-06-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!
Attempted Suicide: అనంతపురం జిల్లాలో మరో దారుణం.. ప్రేమ పేరుతో యువతిని ట్రాప్ చేసిన ఎస్సై