ICAR Recruitment 2021: బెంగళూరులోని ఐకార్ – నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (ఎన్‌బీఎస్‌ఎస్‌ఎల్‌యూపీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఫీల్డ్ సాయిల్ సర్వే వర్క్, జీఐఎస్, ల్యాబ్, హైడ్రాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సెల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థు వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
* అనంతరం ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తలు స్వీకరణకు సెప్టెంబర్ 24 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Space Tour: అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ నలుగురు.. ఎందుకోసం.. ఎప్పుడు.. తెలుసుకుందాం..