AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CA exams 2025 Revised Schedule: వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. మే 16 నుంచి పునఃప్రారంభం

దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో..

CA exams 2025 Revised Schedule: వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. మే 16 నుంచి పునఃప్రారంభం
CA 2025 Revised Schedule
Srilakshmi C
|

Updated on: May 12, 2025 | 8:39 AM

Share

న్యూఢిల్లీ, మే 12: ఇండియా- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది. దీంతో సీఐ ఫైనల్, ఇంటర్మీడియట్, ఐఎన్‌టీటీ-ఏటీ (పీక్యూసీ) పరీక్షలను మే 16 నుంచి 24 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఐసీఏఐ తన ప్రకటనలో తెలిపింది.

కొత్త షెడ్యూల్ ఇదే..

  • మే 10 (శనివారం)న జరగాల్సిన తుది పరీక్ష (గ్రూప్ II) పేపర్ – 5 మే 16 (శుక్రవారం)కి మార్చారు.
  • మే 13 (మంగళవారం) జరగాల్సిన ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ – అసెస్‌మెంట్ టెస్ట్ (INTT–AT) పేపర్ – 2, ఇంటర్నేషనల్ టాక్స్ – ప్రాక్టీస్‌లను కవర్ చేసే ఫైనల్ ఎగ్జామినేషన్ (గ్రూప్ II) పేపర్ – 6లు పరీక్ష మే 18 (ఆదివారం)న నిర్వహించబడుతుంది.
  • మే 9 (శుక్రవారం)న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు (గ్రూప్ II), పేపర్ – 4, కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ పరీక్ష మే 20 (మంగళవారం)కి మార్చారు.
  • మే 11 (ఆదివారం)న జరగాల్సిన పేపర్ – 5, ఆడిటింగ్ & ఎథిక్స్ పరీక్ష మే 22 (గురువారం)న జరుగుతుంది.
  • మే 14వ తేదీ (బుధవారం) జరగాల్సిన పేపర్ – 6, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ పరీక్ష మే 24వ తేదీ (శనివారం)కి మార్చారు.

రీషెడ్యూల్ చేయబడిన పరీక్షలు అవే పరీక్షా కేంద్రాలలో, అదే సమయాలలో అంటే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేయబడిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ చేయబడిన తేదీలకు చెల్లుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు