IBPS RRB PO 2025: మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

IBPS RRB PO admit card 2025 Download Link: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ 2025 పరీక్ష త్వరలోనే నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది...

IBPS RRB PO 2025: మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
IBPS RRB PO admit card 2025 Download

Updated on: Nov 17, 2025 | 7:25 AM

హైదరాబాద్, నవంబర్‌ 17: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ 2025 పరీక్ష త్వరలోనే నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆర్‌ఆర్‌బీ పీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌, రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్ నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా నవంబరు 22, 23 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 3,928 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

ఆర్‌ఆర్‌బీ పీఓ-2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఇంగ్లిస్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం కోర్సుల్లో ప్రస్తుతం సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తులను కాలేజీలో నవంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని తెలిపారు. నవంబర్‌ 18న స్పాట్ ప్రవేశాల్లో సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.