IBPS Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. IBPS రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఐబీపీఎస్ 2026-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాదికి PSBs, RRBsలలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌ కింద ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO), కస్టమర్ సర్వీస్..

IBPS Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. IBPS రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే
IBPS Exam Calendar

Updated on: Jan 17, 2026 | 7:26 AM

హైదరాబాద్‌, జనవరి 17: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2026-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాదికి PSBs, RRBsలలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌ కింద ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO), కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA), RRB అధికారులు వంటి పోస్టులను భర్తీకానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే..

  • పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ (CRP PO/MT-XVI, SPL-XVI, CSA-XVI)లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO/MT) పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలు గస్టు 22,23 తేదీలలో జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 4, 2026వ తేదీన జరుగుతుంది.
  • స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టులకు లిమ్స్ పరీక్ష గస్టు 29, 2026న జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నవంబర్ 1, 2026న జరుగుతుంది.
  • కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA) పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలు అక్టోబర్ 10,11 తేదీలలో జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 27, 2026న జరుగుతుంది.
  • ఆర్‌ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ (RRB) ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నవంబర్ 21, 22 తేదీలలో జరుగుతాయి. మెయిన్స్ డిసెంబర్ 20న జరుగుతాయి.
  • ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్స్ ప్రిలిమ్స్ డిసెంబర్ 6, 12, 13 తేదీలలో జరుగుతుంది. ఇక మెయిన్స్ 2027 జనవరి 30న నిర్వహిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.