ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 పోస్టుల సంఖ్యను పెంచింది. పోస్టులను 7,858 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు ibps / ibps.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా పెంచిన ఖాళీలు చూసుకొవచ్చని తెలిపింది. ఇంతకు ముందు 7,800 క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. తాజాగా మరో 58 పోస్టులు పెంచినట్లు వెల్లడించింది.
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సమానమైన అర్హత కలిగి ఉండాలి. కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు కాగా గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలు ఉంది. అక్టోబర్ 7 న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27, 2021 న ముగుస్తుంది. ఆన్‌లైన్ పద్ధతిలో రెండంచెల ద్వారా నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష. రెండో అంచెలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 2021 లో నిర్వహిస్తారు. ఫలితాలను డిసెంబర్ 2021 లేదా జనవరి 2022 లో ప్రకటిస్తారు. ప్రధాన పరీక్ష 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. క్లరికల్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ భాషలతోపాటు దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IBPS యొక్క అధికారిక సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
Read Also.. Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్.. 5323 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ..