IBM recruitment 2021: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్… ఐబీఎంలో ఎంట్రీ లెవెల్ జాబ్స్

|

Sep 13, 2021 | 5:23 PM

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఫ్రెషర్స్ ఉద్యోగాలు కోరుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (IBM)ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది.

IBM recruitment 2021: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్... ఐబీఎంలో ఎంట్రీ లెవెల్ జాబ్స్
Ibm
Follow us on

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఫ్రెషర్స్ ఉద్యోగాలు కోరుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (IBM)ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోర్సులు పూర్తి చేసి కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. అప్లికేషన్స్ రూపొదించడం, కోడ్స్ రాయడం, టెస్ట్ చేయడం, డీబగ్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లాంటివాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఛాన్స్. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఇలా చేయొచ్చు.

విద్యార్హతలు:  కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో బీఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు చదువుతుండాలి. ఎంట్రీలెవెల్ లేదా ఫ్రెషర్ జాబ్స్ కాబట్టి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

IBM ఎంట్రీ లెవల్ జాబ్ వివరణ

తాజా గ్రాడ్యుయేట్‌లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా నియమించబడతారు. వీరు అప్లికేషన్‌లను రూపొందించడం, రాయడం, పరీక్షించడం. డీబగ్గింగ్ కోడ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లపై పని చేస్తారు.

అనుభవం ఉన్నవారు…

ఐబీఎం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వీటి కోసం ఫ్రెషర్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అనుభవం ఉన్నవారు ఇదే వెబ్‌సైట్‌లో IBM Careers India ట్యాబ్ పైన క్లిక్ చేసి ఇతర ఉద్యోగాల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Altcoins: ఆల్ట్‌కాయిన్‌లపై పెట్టుబడి పెడితే బిట్‌కాయన్‌ను మించిన లాభాలు.. ఈ ఏడాది 8000 శాతం రాబడి..

Zomato: ఈ నెల17 నుంచి నిత్యావసరాల సేవలు బంద్.. కీలక ప్రకటన చేసిన జొమాటో