
చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ.. ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 14, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కి పంపించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ట్రేడ్ టెస్ట్, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, పోస్ట్ బ్యాగ్ నెం. 01, హెచ్‌వీఎఫ్ ఎస్టేట్, అవడి, చెన్నై – 600 054.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.www.ddpdoo.gov.in/www.avnl.co.in
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.