ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎంసెట్, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ వంటి రకరకాల పోటీ పరీక్షలు ఉన్నాయి. దీంతో విద్యార్ధులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొందరు పరీక్షల్లో ఎలాగైనా గట్టెక్కితే చాలనుకుంటే.. మరికొందరేమో టాప్ ర్యాంకులు కొట్టాలనే సంకల్పంతో నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే సన్నద్ధత ఒక ఎత్తైతే.. కంగారు పడకుండా, ఒత్తిడి లేకుండా పరీక్ష హాలులో ప్రశాంతంగా రాయండం మరో ఎత్తు. కానీ పరీక్షలనగానే మనలో ఒక విధమైన భయం, ఆందోళన మొదలవుతుంది. ఎన్నో వారాల క్రితమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా.. 24 గంటల కంటే తక్కువ సమయం మిగిలి ఉందనగా మొత్తం సిలబస్‌ను చూస్తూ దిగాలు పడిపోతారు. టెన్షన్‌తో అధికంగా కెఫిన్ తీసుకోవడం, తీవ్ర భయాందోళనలతో చదివిందంతా మర్చిపోవడం వంటివి మనలో చాలా మందికి అనుభవమే. పరీక్షలకు చివరి నిమిషంలో ఇలాంటి అనార్ధాలు జరిగితే కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే పరీక్షకు చివరి నిమిషంలో పాటించవల్సిన కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పరీక్ష మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుందనా.. పూర్తి భయాందోళనలోకి దిగే ముందు ఒక్క విషయం మనసులో గుర్తుంచుకోవాలి. ఒక లోతైన శ్వాస తీసుకొని ప్రస్తుత వాస్తవికతను అంగీకరిండానికి సిద్ధం ఉండాలి. పరీక్షకు ముందు మీరు ఆశించిన స్థాయిలో ప్రిపేర్ అవకపోతే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అది తప్పేంకాదు. ఒక విధంగా పర్వాలేదు. స్వీయ-ద్వేషానికి సమయం ఇవ్వడానికి బదులుగా ఆ శక్తినంతా కూడదీసుకుని ప్రిపరేషన్ వైపు మళ్ళించండి. భయం నుంచి బయటపడటానికి ఇదే ఏకైక మార్గం.
మొత్తం పాఠ్యపుస్తకాలను చదవడానికి లేదా మిగిలిపోయిన పాఠాలను వల్లెవేయడానికి డబుల్ స్పీడ్‌లో చదివేంత సమయం కాదిది. కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలి. సారాంశాలు, కీలక అంశాలు, గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చేసుకోవాలి. నమూనాల కోసం మునుపటి పరీక్ష పత్రాలను చూడాలి. ఆ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు మీ పరీక్షలో ‘ఏమి రావచ్చు?’ అనే గొప్ప రహస్యాన్ని డిటెక్టివ్‌గా మీకుమీరే ఆలోచించుకుని ఆయా అంశాలపై దృష్టి పెట్టండి.
ఫోన్ ఆఫ్‌లో ఉంచాలి. సోషల్ మీడియా స్వీచ్ ఆఫ్ చేయాలి.. ఇలా మిమ్మల్ని భయాందోళనలకు గురిచేసి, మిమ్మల్ని మరింత బాధపెట్టేది ఏదైనా సరే దానిని దూరంగా పెట్టాలి. పరధ్యానం లేని ప్రశాంత వాతావరణం స్థలాన్ని కనుగొని అక్కడే కూర్చుని పరీక్ష ప్రారంభానికి రాబోయే కొన్ని గంటల వరకు కఠోరంగా చదవాలి.
మీ మెదడు ప్రస్తుతం గోల్డ్ ఫిష్‌లాగా ఉంచాలి. కాబట్టి వరుసగా ఐదు, ఆరు గంటలు చదివేయడం సరికాదు. బదులుగా పోమోడోరో టెక్నిక్‌ను ఉపయోగించండి. 25 నిమిషాలు తీవ్రంగా శ్రద్ధగా చేయడం, తరువాత 5 నిమిషాలు విరామం తీసుకోవడం చేయాలి. ఇది మీ మెదడును ఒత్తిడికి గురి చేయదు. అది మీరు బాధపడటం లేదని నమ్మేలా చేస్తుంది. చదివిన అంశాలను మెదడులో బాగా నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
నిష్క్రియాత్మక పఠనం పెద్దగా ఉపయోగపడదు. మీ మెదడు ఇప్పటికే మెల్ట్‌డౌన్ మోడ్‌లో ఉంటుంది. కాబట్టి ఇందుకు బదులుగా చదివిన విషయాలను రాయాలి. మైండ్ మ్యాప్స్ చేయడం, మీ ఊహాత్మక ప్రేక్షకులకు మీరు చదివింది చెప్పడం, రాయడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చదివిన అంశాలు ప్రాసెస్ అయ్యి శాశ్వతంగా గుర్తుంటాయి.
సంక్షిప్తాలు, ప్రాసలు, జ్ఞాపకాలు వంటి వాటివి చదివిన అంశాలను గుర్తుంచుకునేలా చేస్తాయి. ఉదాహరణకు చరిత్ర చదువుతుంటే.. కీలక తేదీలను హాస్యాస్పదమైన పాటగా మార్చండి. అది సైన్స్ అయితే అసంబద్ధ సారూప్యతలను సృష్టించండి. అవి ఎంత ఫూలిష్‌నెష్‌గా ఉంటే అంత మంచిది.
నిద్రలేమి, డీహైడ్రేషన్‌తో ఉండే వారు పరీక్షల్లో అంతబాగా రాణించలేడు. రోజుకు కనీసం నాలుగు గంటలు నిద్రపోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. లేచి గదిలో కాసేపు నడవండి. అలాగే అతి అత్మవిశ్వాసం కూడా తగదు. ఈ విధమైన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేస్తుంది. దీంతో విషయం గుర్తుండదు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి ఈ ప్రభావవంతమైన పద్ధతులు పాటించాలి. బదులుగా.. నేను పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను బాగా రాయగలను వంటి సానుకూల అంశాలు పునరావృతం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా ధైర్యం పెరుగుతుంది. పరీక్ష హాలులో ఎలాంటి బెదురులేకుండా ప్రశ్రాంతంగా పరీక్ష రాయగలరు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.