Cyber Security Internships 2025: యువతకు భలే ఛాన్స్.. సైబర్‌ సెక్యురిటీలో ఉచిత శిక్షణకు నోటిఫికేషన్! దరఖాస్తులు ఇలా

Home ministry offers free cyber security internship 2025: నిత్యం వందలాది మంది ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ బెదిరింపుల నుంచి సాధారణ ప్రజలను రక్షించడం, వారిని అప్రమత్తం చేయడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీలో శిక్షనకు..

Cyber Security Internships 2025: యువతకు భలే ఛాన్స్.. సైబర్‌ సెక్యురిటీలో ఉచిత శిక్షణకు నోటిఫికేషన్! దరఖాస్తులు ఇలా
Home Ministry Offers Cyber Security Internship 2025

Updated on: Oct 10, 2025 | 7:50 AM

నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిత్యం వందలాది మంది ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ బెదిరింపుల నుంచి సాధారణ ప్రజలను రక్షించడం, వారిని అప్రమత్తం చేయడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C).. సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో అనుభవాన్ని పొందడమే కాకుండా సైబర్ నేరాల నుంచి దేశాన్ని సురక్షితంగా మార్చడంలోనూ దోహదపడగలరు.

ఎవరు అర్హులంటే..

  • ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు యుజీ, పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్
  • LLB లేదా LLM, క్రిమినాలజీ లేదా సోషియాలజీ
  • బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, డార్క్ వెబ్ డొమైన్ ఎక్స్‌పర్‌టైజ్, ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్
  • API లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్, మాల్వేర్ అనాలసిస్‌ – రివర్స్ ఇంజనీరింగ్, కంటెంట్ క్రియేషన్
  • జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, న్యూ మీడియా లేదా డిజిటల్ జర్నలిజంలో బీఏ లేదా ఎంఏ
  • డిజిటల్ మీడియా, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా వీడియో ఎడిటింగ్‌లో డిప్లొమా/డిగ్రీ
  • ఈవెంట్స్ లేదా పిఆర్ స్టడీస్‌లో ఎంఏ లేదా డిప్లొమా
  • డేటా అనలిటిక్స్ లో BBA లేదా MBA, టెక్నాలజీ, లా, సోషల్ సైన్సెస్, మీడియాకు సంబంధించిన కోర్సులలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్
  • గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 17, 2025వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • ఆ తర్వాత ‘What’s New’ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అందులో వివరణాత్మక ఇంటర్న్‌షిప్ సమాచారం, దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అన్ని అర్హత ప్రమాణాలు, నియమాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆపై ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

ఈ ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో ఆచరణాత్మక అనుభవాన్ని అందించడమే కాకుండా సైబర్ క్రైమ్ దర్యాప్తు, సమస్యల పరిష్కార విధానాలను నేర్పుతారు. ప్రఖ్యాత నిపుణులతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు నేరుగా దోహదపడవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమం అభ్యర్ధుల రెజ్యూమ్‌ను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.