High Salary Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే పదేళ్లలో కాసుల వర్షం కురిపించే టాప్ 20 జాబ్స్ ఇవే! ఏకంగా కోట్లలో జీతాలు..

వేగంగా పరుగులు తీస్తున్న జిందగీలో అందినంత వరకు అవకాశాలను అందిపుచ్చుకుంటేనే కెరీర్‌ సుపంపన్నం అవుతుంది. ఏ మాత్రం వెనక పడ్డారో పాతాళంలో పడిపోతారు. విద్య నుంచి జాబ్‌ వరకు జీవితంలోని ప్రతి అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేటి AI డిజిటలైజేషన్ యుగంలో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతున్నప్పటికీ.. ఆకర్షణీయ జీతంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, హెల్త్‌ సర్వీస్‌లలో జాబ్‌లకు అధిక డిమాండ్ ఉంది. రాబోయే పదేళ్లలో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలకు ఢోకాలేనది నిపుణులు భావిస్తున్నారు..

High Salary Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే పదేళ్లలో కాసుల వర్షం కురిపించే టాప్ 20 జాబ్స్ ఇవే! ఏకంగా కోట్లలో జీతాలు..
High Paying Jobs

Updated on: Sep 02, 2025 | 6:19 PM

తమ కెరీర్‌లను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకునే కాలేజీ స్టూడెంట్స్‌, యువత.. భవిష్యత్తు అవకాశాలను జాగ్రత్తగా అంచనా వేయగలగాలి. అలాగే కాల గమనంలో కనుమరుగయ్యే రంగాలను పూర్తిగా విస్మరించాలి. ఎందుకంటే జాబ్‌లో కొన్నేళ్లు కొనసాగిన తర్వాత ఉన్నట్లుండి కెరీర్‌లను మార్చుకోవడం అంత సులువుకాదు. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, బిజినెస్‌ రంగాల్లో వేగవంతమైన పురోగతి చోటు చేసుకోనుంది. ఈ రంగాలు సమృద్ధిగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తూనే ఉంటాయి మరీ. వృత్తిపరమైన వృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి సరైన కెరీర్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. US శాలరీ డేటా ఆధారంగా.. వచ్చే పదేళ్లలో డిమాండ్‌లో ఉన్న అత్యధిక శాలరీ వచ్చే ఉద్యోగాలు ఇవే..

  • సాఫ్ట్‌వేర్ డెవలపర్.. ఏడాదికి రూ. 1,10,45,640 వరకు జీతం పొందొచ్చు. నెలకు: రూ. 9,20,470
  • ఫైనాన్షియల్‌ మేనేజర్‌.. ఏడాదికి రూ. 1,34,21,100 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 11,18,425
  • కంప్యూటర్ అండ్‌ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్.. ఏడాదికి రూ. 1,42,09,600 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 11,84,133
  • జనరల్ అండ్‌ ఆపరేషన్స్ మేనేజర్.. ఏడాదికి రూ. 85,44,850 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 7,12,071
  • మెడికల్‌ అండ్‌ హెల్త్ సర్వీసెస్ మేనేజర్‌.. ఏడాదికి రూ. 97,90,680 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 8,15,890
  • నర్స్ ప్రాక్టీషనర్.. ఏడాదికి రూ. 1,07,24,430 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 8,93,703
  • రిజిస్టర్డ్ నర్స్.. ఏడాదికి రూ. 77,68,800 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 6,47,400
  • మేనేజ్‌మెంట్ అనలిస్ట్‌.. ఏడాదికి రూ. 83,98,770 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 6,99,898
  • డేటా సైంటిస్ట్.. ఏడాదికి రూ. 93,44,970 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 7,78,748
  • ఇన్ఫర్మేషన్‌ సెక్యురిటీ అనలిస్ట్‌.. ఏడాదికి రూ. 1,03,67,530 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 8,63,961
  • అకౌంటెంట్ అండ్ ఆడిటర్.. ఏడాదికి రూ. 67,79,440 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 5,64,953
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్.. ఏడాదికి రూ. 83,62,250 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ. 6,96,854
  • లాయర్‌.. ఏడాదికి రూ.1,25,46,280 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.10,45,523
  • పోస్ట్ సెకండరీ హెల్త్ సబ్జెక్ట్ టీచర్.. ఏడాదికి రూ.87,66,460 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.7,30,538
  • కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌.. ఏడాదికి రూ.88,79,340 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.7,39,945
  • మార్కెట్ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అండ్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌.. ఏడాదికి రూ. 63,86,850 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.5,32,238
  • కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్.. ఏడాదికి రూ.86,14,570 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.7,17,881
  • ఫిజీషియన్‌ అసిస్టెంట్.. ఏడాదికి రూ.1,10,60,580 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.9,21,715
  • మార్కెటింగ్ మేనేజర్.. ఏడాదికి రూ.1,33,65,490 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.11,13,791
  • సేల్స్ మేనేజర్.. ఏడాదికి రూ.1,14,58,980 వరకు జీతం పొందొచ్చు. నెల జీతం రూ.9,54,915

ఈ జాబ్స్‌ ఆకర్షణీయమైన జీతాలను అందించడమే కాకుండా, రాబోయే పదేళ్లలో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. దీర్ఘకాలిక కెరీర్ వృద్ధి ఇవే బెస్ట్ జాబ్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.