IICB Recruitment 2022: నెలకు రూ.53,495ల జీతంతో గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు.. నేడే ఇంటర్వ్యూ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యా, ఆరోగ్య శాఖ విభాగం గుంటూరు జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన..

IICB Recruitment 2022: నెలకు రూ.53,495ల జీతంతో గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు.. నేడే ఇంటర్వ్యూ..
ACSR

Updated on: Apr 20, 2022 | 8:34 AM

Guntur District Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యా, ఆరోగ్య శాఖ విభాగం గుంటూరు జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

ఖాళీల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.53,495ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ), గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IICB Recruitment 2022: నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హతతో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో ఖాళీలు..