Goa Shipyard Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన గోవా షిప్‌యార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల అర్హత ఆధారంగా పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
* ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ ఫిట్టర్, ఎలక్ట్రికల్ మెకానిక్, కమర్షియల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అన్‌స్కిల్డ్, ఎఫ్ఆర్‌పీ లామినేటర్, ఈఓటీ క్రేన్ ఆపరేటర్, వెల్డర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, నర్సు, ట్రెయినీ కలాసి పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఐటీఐ/ ఎన్‌సీటీవీటీ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్), డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.03.2021 నాటికి 33 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల ప్రక్రియ 04.05.2021న ప్రారంభంకాగా.. చివరి తేదీగా 04.06.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://goashipyard.in/ వెబ్‌సైట్‌ను చూడండి.
Also Read: Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!
ఈ చిట్కాలు ఫాలో అయితే నిమిషాల్లో కళ్ళవాపు తగ్గిపోతుందట… డార్క్ సర్కిల్స్ తొలగించే పద్దతులు.
తమిళనాడులో దారుణం.. ఏనుగులను వేధిస్తున్న గిరిజన యువకులు.. ముగ్గురిపై కేసు నమోదు..