GGH Vijayawada Lab technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH Vijayawada) ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, క్యుపేషనల్ థెరపిస్ట్ (Lab technician jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, క్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు.
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ. 300
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: సూపరింటెండెంట్ కార్యాలయం, జీజీహెచ్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.