GSI Recruitment 2022: టెన్త్‌ అర్హతతో.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.రూ.63,200ల జీతం..

|

Aug 19, 2022 | 3:43 PM

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (Geological Survey of India) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో పనిచేయుటకు.. 18 గ్రూప్ 'సీ' పోస్టుల (Ordianary Grade Driver Posts) భర్తీకి..

GSI Recruitment 2022: టెన్త్‌ అర్హతతో.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.రూ.63,200ల జీతం..
Geological Survey Of India
Follow us on

Geological Survey of India Group ‘C’ Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (Geological Survey of India) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో పనిచేయుటకు.. 18 గ్రూప్ ‘సీ’ పోస్టుల (Ordianary Grade Driver Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధులకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. ట్రక్‌, జీప్‌ వాహనాలను నడపడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులను పంపవచ్చు. నోటిపికేషన్‌ విడుదలైన 45 రోజుల్లోపు (సెప్టెంబర్‌ 12, 2022వ తేదిలోపు) దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఆగస్టు 13, 2022వ తేదీన విడుదలైంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: Director General & HOD, Eastern Region, Geological Survey of India, Block DK, sector II, salt lake city, Kolkata 700091.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.