GATE 2022: గేట్‌ 2022 ఫలితాల ప్రకటన తేదీ ఇదే! ఆన్సర్‌ కీ ఎప్పుడు విడుదలవుతుందంటే..

|

Feb 08, 2022 | 5:54 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ఫిబ్రవరి 21న గేట్‌ 2022 (GATE 2022 Answer Key) ఆన్సర్ కీని విడుదల చేయనుంది..

GATE 2022: గేట్‌ 2022 ఫలితాల ప్రకటన తేదీ ఇదే! ఆన్సర్‌ కీ ఎప్పుడు విడుదలవుతుందంటే..
Gate 2022
Follow us on

GATE 2022 Answer Key release date: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ఫిబ్రవరి 21న గేట్‌ 2022 (GATE 2022 Answer Key) ఆన్సర్ కీని విడుదల చేయనుంది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు చెందిన ఆన్సర్ కీని గేట్ ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌ gate.iitkgp.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 నుంచి అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం.. ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు సమర్పించవచ్చు. ఐతే అభ్యర్థులు ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి ఒక్కో ప్రశ్నకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఫలితాలు మార్చి 17న ప్రకటించబడతాయి. స్కోర్‌కార్డులను మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

గేట్ 2022 ఆన్సర్ కీని ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ gate.iitkgp.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజీలో కనిపించే గేట్ ఆన్సర్ కీ 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేయగానే.. ఈ ఆన్సర్‌ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కాగా గేట్‌ 2022 పరీక్ష ఈ నెల (ఫిబ్రవరి) 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్షాకేంద్రాల్లో నిర్వహించబడింది. పరీక్ష మళ్లీ ఫిబ్రవరి 12, 13న నిర్వహించబడుతుంది. గేట్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెల్పింది.

Also Read:

Management Trainee Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెట్‌లో 75 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే!