GAIL Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
GAIL Recruitment: గెయిల్ (GAIL) ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు...
GAIL Recruitment: గెయిల్ (GAIL) ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ ఇంజనీర్ (3), ఫోర్‌మెన్ (17), జూనియర్ సూపరింటెండెంట్ (25), జూనియర్ కెమిస్ట్ (8), టెక్నికల్ అసిస్టెంట్ (3), ఆపరేటర్ (52), టెక్నీషియన్ (103), అసిస్టెంట్ (28), అకౌంట్స్ అసిస్టెంట్ (24), మార్కెటింగ్ అసిస్టెంట్ (19) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15ను చివరి తేదీగా నియమించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..