GAIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో మెడికల్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (GAIL Limited).. తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌ టైం లేదా పార్ట్‌ టైం మెడికల్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Medical Consultant Posts) భర్తీకి..

GAIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో మెడికల్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..
Gail Limited
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2022 | 7:27 PM

GAIL Medical Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (GAIL Limited).. తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌ టైం లేదా పార్ట్‌ టైం మెడికల్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Medical Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 14

పోస్టుల వివరాలు: మెడికల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

విభాగాలు: ఆయుర్వేద, హోమియోపతి, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాలజిస్ట్‌, కార్డియాలజిస్ట్‌, ఎండోక్రైనాలజిస్ట్‌, సోనాలజిస్ట్‌/రేడియాలజిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

పే ప్కేల్: నెలకు రూ.93,000ల నుంచి రూ.1,13,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruitment.pata@gail.co.in

అడ్రస్‌: శ్రీ శశాంక్‌ సక్సేనా, జీఎం (హెచ్‌ఆర్‌), న్యూ పాలిమర్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

GGH Siddipet Recruitment 2022: సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో స్పెషలిస్టు డాక్టర్‌ ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారానే..