FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

|

Mar 31, 2021 | 10:21 AM

FCI Recruitment 2021: ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
Follow us on

FCI Recruitment 2021: ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 89 పోస్టులకు గానూ దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇవాళే ఆఖరు తేదీ. అసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ (వెబ్‌సైట్ https://fci.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక రాత ప‌రీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అయితే ఈ పరీక్ష మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నారు.

ఎఫ్‌సీఐలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
మొత్తం 89 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటిలో పలు విభాగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్)‌: 27 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 55శాతం మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ లేదా అగ్రిక‌ల్చర్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్)‌: 22 ఖాళీలు
అర్హత: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం క‌లిగి ఉండాలి. వయస్సు: 28 ఏళ్ల లోపు ఉండాలి.
వయసు: 28 ఏళ్ల లోపు ఉండాలి.
3. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అడ్మినిస్ట్రేషన్): 30 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ/ పీజీ లేదా త‌త్ససమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏళ్ల లోపు ఉండాలి.
4. మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 2 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత కోర్సులో ఇంట‌ర్న్‌షిష్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.
వయస్సు: 35 ఏళ్ల లోపు ఉండాలి.
5. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా): 8 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ప‌నిలో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.
వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం వివరాలు:
అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు: రూ.60,000 నుంచి రూ.1,80,000 ఉంటుంది.
మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు‌ల‌కు: రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు రాత ప‌రీక్షలో 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇక ఆన్‌లైన్ ప‌రీక్ష మొత్తం 180 మార్కుల‌కు ఉంటుంది.

Note: పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://fci.gov.in/ లో చూడవచ్చు.

Also read:

మయన్మార్ సరిహద్దు‌లో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

5G vs 4G: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 5జీ, 4జీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..