ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబైలోని ఈ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* అనస్తిషియా, మెడిసిన్, ఈఎన్‌టీ, పాథాలజీ, మైక్రోబయోలజీ విభాగాల్లో ఉన్న సీనియర్ రెసిడెంట్, ఫిజిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీహెచ్‌ఎంఎస్/ ఎంబీబీఎస్, పీజీ/ ఎండీ/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 5వ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మోడల్ హాస్పిటల్ రిక్రూట్‌మెంట్ బ్రాంచ్, ఈఎస్‌ఐఎస్ హాస్పిటల్ కండివాలి, ముంబై 400101 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* దరఖాస్తు ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను డిసెంబర్ 05, 06 తేదీల్లో నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..