ECIL Recruitment 2021: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ దేశంలోని వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పని చేయడానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 300 టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30-11-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను బీఈ/ బీటెక్‌లో సాధించిన మార్కులు, పని అనుభం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులన్ని ఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25000 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 21-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..
Health Tips: మీ చూపు మందగిస్తున్నట్లయితే భోజనం చేసిన తర్వాత ఇలా చేయండి..