ECIL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? దరఖాస్తల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడులాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఈసీఈ (21), మెకానికల్ (10), సీఎస్‌ఈ (9) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్-2022 వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను 2022 గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే రూ. 54,880 జీతంగా చెల్లిస్తారు.
* ఏప్రిల్ 23న మొదలైన దరఖాస్తుల స్వీకరణకు మే 14ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..
Also Read: Viral Video: కొత్త జంటకు ఫ్రెండ్స్ వింత బహుమతులు.. ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి
CIBIL Score: సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా లోన్స్ కావాలా.. అయితే ఇలా పొందండి..
Andhra Pradesh: అచ్చు పుష్పలోని సీన్ –లారీ ట్రాలీ, యాక్సిల్ కి మధ్యలో !!