Telangana: తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఈ ఏడాదికిగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులను ప్రకటించారు. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10న తెరుచుకోనున్నాయి.
ఈసారి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం 13 రోజులు సెలువులు ప్రకటించినప్పటికీ విద్యార్థులకు మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9న ఆదివారాలు కావడమే దీనికి కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో సెలవులను పెంచిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..