DRDO-DIBER Recruitment 2022: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Jul 27, 2022 | 4:24 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌ (DRDO - DIBER).. రిసెర్చ్‌ అసోసియేట్, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (Research Associate Posts) పోస్టుల..

DRDO-DIBER Recruitment 2022: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Drdo
Follow us on

DRDO-DIBER Research Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ – డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌ (DRDO – DIBER).. రిసెర్చ్‌ అసోసియేట్, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (Research Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కెమిస్ట్రీ, అగ్రికల్చర్‌ సైన్సెస్‌, అగ్రి ఎక్స్‌టెన్షన్‌, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మకాలజీ, రెనవబుల్‌ ఎనర్జీ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌, రిసెర్చ్‌ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కెమిస్ట్రీ/హార్టికల్చర్‌/వెజిటబుల్ సైన్స్‌/అగ్రోనమీ/అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే రీసెర్చ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా ఉండాలి. యూజీసీ నెట్/జీప్యాట్‌/గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ సాధించినవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు 28 నుంచి35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఎంపికైతే నెలకు రూ.31000ల నుంచి రూ.54000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ అడ్రస్: DIBER-DRDO, HALDWANI, UTTRAKHAND, PIN 263139.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.