కెనడాలో చదువడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భారతీయ విద్యార్థులు కెనడాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం పంజాబ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కెనడాలో చదువుతోన్న మొత్తం భారతీయ విద్యార్థులు 40 శాతం మంది పంజాబ్‌కు చెందిన వారే. ప్రస్తుతం కెనడాలో సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాపై ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ కెనడాపై అంత క్రేజ్‌కు అసలు కారణం ఏంటి.? అక్కడనున్న ప్రత్యేకతలు ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కెనడాలో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కెనడా తమ వీసాను రద్దు చేస్తే ఏంటన్న ఆందోళన భారతీయ విద్యార్థుల్లో ఉంది. అయితే ఈ పరిస్థితి కేవలం తాత్కలికమేననే వాదనలు వినిపిస్తున్నాయి. పరిస్థితుల మళ్లీ సద్దుమనగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కెనడా దేశం విద్యార్థులను ఆకర్షిస్తుండడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతర దేశాలతో పోల్చితే కెనడాలో చదువుకోవడం, నివసించడం చాలా చౌక. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో విశ్వ విద్యాలయాల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే కెనడాలో దీనికి సగం ఫీజులోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేయవచ్చు. కెనడాలో భారతీయ విద్యార్థులు తక్కువ ఫీజులతో మంచి విద్యను పొందుతారు. కెనడాలో విద్యపై సగటున ఏడాదికి రూ. 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కెనడాలో ఏడాదికి రూ. 80 వేలతో జీవించొచ్చు.
ఇక కెనడాలో విద్యార్థులు చదువుకుంటూఏ పని చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థి స్కోర్ బాగుంటే యూనివర్సిటీలు ఉద్యోగం చేయడానికి అనుమతిస్తాయి. దీంతో విద్యార్థులు తమ చదువులను సులభంగా కంప్లీట్ చేయొచ్చు. కెనడాలో దాదాపు 150 దేశాల పౌరులు నివసిస్తున్నారు. ఇది భారతీయ విద్యార్థులకు వివిధ దేశాలకు చెందిన భాషలను, సంస్కృతులను నేర్చుకునే అవకాశం లభిస్తోంది.
ఇక కెనడాలోని పలు టాప్ యూనివర్సిటీలన్నీ విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. ఏడాదికి రూ. 1 లక్ష నుంచి రూ. 1.50 వరకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే కెనడా ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతోంది. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కూడా సులభంగా పొందే అవకాశం ఉంది. కెనడా ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉన్న కారణంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
కెనడాలో పౌరసత్వం పొందడం కూడా చాలా సులభం. ఈ దేశంలో 3 నుంచి 4 ఏళ్లు నివసిస్తే చాలు సులభంగా పౌరసత్వం పొందొచ్చు. ఇతర దేశాల్లో అయితే పౌరసత్వం పొందడానికి 10 నుంచి 12 ఏళ్లు పడుతుంది. తక్కువ సమయంలో కెనడియన్‌గా పౌరసత్వంగా పొందే అవకాశం ఉండడం కూడా కెనడాలో ఎక్కువ మంది చదువుకోవడానికి మరో కారణంగా చెబుతున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..