AP SSC: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే..

|

Oct 26, 2024 | 10:18 AM

పదో తగరతి ఎగ్జామ్స్ కు సంబంధించి ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు. ఇంతకీ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఎప్పుడు.? ఆలస్య రుసుము ద్వారా ఎంత చెల్లించాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

AP SSC: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే..
Ap Ssc
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి అధికారులు ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఫీజును చెల్లించాలని అధికారులు తెలిపారు. పాఠశాల లాగిన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయులు కూడా చెల్లించవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్‌ 28వ తేదీ నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభంకానున్నాయి. ఫీజ చెల్లంపునకు చివరి తేదీగా నవంబర్‌ 11ని నిర్ణయించారు.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు అయితే 3 పేపర్లకు రూ. 110 అంతకంటే ఎక్కువగా ఉంటే రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వయసు తక్కువగా ఉండి పరీక్షకు హాజరవుతుంటే రూ. 300 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్‌ 11వ తేదీ తర్వాత ఫీజు చెల్లిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

నవంబర్‌ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు లేట్‌ ఫీజుతో రూ. 50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా నవంబర్‌ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఫీజు చెల్లిస్తే అదనంగా రూ. 200 చెల్లించాలి. ఇక నవంబర్‌ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చెల్లిస్తే ఆలస్య రుసుము కింద రూ. 500 లేట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్‌లోడ్ చేశారు. అయితే 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు. కొత్త సిలబస్‌కు సంబంధించి ఏడు పేపర్ల ప్రశ్నల వారీగా మార్కుల వెయిటేజీ, మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..