Alert: విద్యార్థులూ బీకేర్‌ఫుల్.. ఉన్నత విద్య కోసం అక్కడకు వెళ్తున్నారా..? తిప్పలు తప్పవట జాగ్రత్త..

విద్యార్థులూ.. ఉన్నత విద్య కోసం కెనడా వెళ్తున్నారా?.. అయితే.. బీ అలెర్ట్‌ అంటున్నారు.. భారత దౌత్యవేత్త సంజయ్‌ కుమార్‌ వర్మ... కెనడా చదువులతో తిప్పలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఇంతకీ.. ఎందుకో.. ఏంటో.. ఇప్పుడు తెలుసుకోండి..

Alert: విద్యార్థులూ బీకేర్‌ఫుల్.. ఉన్నత విద్య కోసం అక్కడకు వెళ్తున్నారా..? తిప్పలు తప్పవట జాగ్రత్త..
Sanjay Verma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 26, 2024 | 11:03 AM

కెనడాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా వెళ్లాలనుకునే విద్యార్ధులు.. వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కెనడాలోని పలు చీకటి కోణాలను వెల్లడించిన ఆయన.. అక్కడి చదువులతో భారతీయ విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయని చెప్పారు. పైచదువుల కోసం కెనడాకు వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారని.. వారి తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్మి, బ్యాంకు లోనులు తీసుకొని మరీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశాలకు పంపిస్తుంటారన్నారు. కానీ.. ప్రస్తుతం కెనడాలోని దుర్భర పరిస్థితులతో అక్కడికి పిల్లల్ని పంపాలనుకునే తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

కెనడాలోని నాసిరకం విద్యా సంస్థల కారణంగా లక్షలు వెచ్చించినా ఉద్యోగాలు రావడం లేదన్నారు సంజయ్‌కుమార్‌ వర్మ. వారానికి ఒకసారి మాత్రమే క్లాసులు జరిగే కాలేజీలు చాలానే ఉన్నాయని.. అలాంటి కాలేజ్‌లతో చదువులు ముందుకు సాగవని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. వారానికి ఒకసారి మాత్రమే క్లాసులు జరిగితే విద్యార్థులు ఏం నేర్చుకుంటారనేది ఆలోచించాలన్నారు. చదువులు సరిగ్గా లేక ఉద్యోగం లేక నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు భారతీయ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. దాంతో.. చదువుల కోసం తెచ్చిన అప్పులు కట్టలేక, తిరిగి ఇండియాకు రాలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

అందుకే పిల్లలను కెనడాకు పంపేముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు సంజయ్‌కుమార్‌ వర్మ. ఇక.. 2022 నుంచి మొన్నటి వరకు కెనడా హైకమిషనర్‌గా పనిచేసిన సంజయ్‌కుమార్‌.. ఇటీవల భారత్‌- కెనడా దేశాల మధ్య దౌత్య వివాదం కారణంగా ఈ నెల మొదట్లో ఇండియాకు తిగిర వచ్చేశారు. ఇటీవల భారత్‌, కెనడా మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో.. విద్యార్థుల సంక్షేమం, చదువుల నాణ్యతపై సంజయ్‌కుమార్‌ వర్మ వ్యాఖ్యలు కెనడా చదువులపై అనుమానాలకు తావిస్తున్నాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..