విద్యారంగంలో ఏఐ ఆప్షన్ కాదు.. కంపల్సరీ.. డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా ప్రిన్సిపాల్స్ కాంక్లేవ్

భారతీయ పాఠశాల విద్యా రంగానికి దిశా నిర్దేశం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్స్, విద్యావేత్తలు ఒకే వేదికపైకి వచ్చారు. ఆల్ ఇండియా ప్రిన్సిపాల్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్కూల్స్ సంయుక్త ఆధ్వర్యంలో డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 అండ్ ప్రిన్సిపాల్ కాంక్లేవ్ అట్టహాసంగా జరిగింది.

విద్యారంగంలో ఏఐ ఆప్షన్ కాదు.. కంపల్సరీ.. డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా ప్రిన్సిపాల్స్ కాంక్లేవ్
Dbs Global University Hosts National Education Excellence Awards

Updated on: Jun 23, 2026 | 7:04 PM

గురువు దైవంతో సమానం అంటారు. విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజాభివృద్ధికి తోడ్పడేది గురువు. ఒక స్కూల్ అద్భుతంగా రాణించాలంటే అందులో ప్రిన్షిపాల్ కృషి ఎనలేనిది. ఇటు ప్రిన్సిపాల్ కృషితో పాటు అటు విద్యారంగంలోనూ ఏఐ ప్రాధాన్యతను చాటి చెప్తూ డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో స్పెషల్ కాంక్లావే నిర్వహించారు. మన దేశంలోనే టాప్ ఏఐ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన డెహ్రాడూన్‌లోని డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 అండ్ ప్రిన్సిపాల్ కాంక్లేవ్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ప్రిన్సిపాల్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్కూల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 500 మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్స్, విద్యావేత్తలు, స్కూల్ నిర్వాహకులు పాల్గొన్నారు. భారతీయ పాఠశాల విద్యా రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

విద్యా రంగంలో AI విప్లవం

ఈ సదస్సు కేవలం సన్మానాలకే పరిమితం కాకుండా భవిష్యత్తు విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను చాటిచెప్పింది. యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ రాఘవ్ ఉపాధ్యాయ నేతృత్వంలో ప్రిన్సిపాల్స్ కోసం ప్రత్యేకంగా AI వర్క్‌షాప్ నిర్వహించారు. ఇంటెలిజెంట్ క్లాస్‌రూమ్‌లు, పర్సనలైజ్డ్ లెర్నింగ్, ఏఐ ఆధారిత అడ్మినిస్ట్రేషన్, డేటా డ్రివెన్ అకడమిక్ ప్లానింగ్ ద్వారా విద్యా రంగాన్ని ఏఐ ఎలా మార్చబోతోందో ఆయన వివరించారు. పాఠశాలల్లో ఏఐ పరికరాల వినియోగం, ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపుపై ప్రిన్సిపాల్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
డీప్ కనెక్షన్ సౌజన్యంతో జరిగిన ఈ కాంక్లేవ్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అందరికీ సమానమైన విద్య మరియు విద్యా సంస్థల నాయకత్వ బాధ్యతలపై ఆసక్తికరమైన ప్యానెల్ చర్చలు జరిగాయి.

నవభారత నిర్మాతలు..

ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపాల్స్ కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, వారు నవభారత నిర్మాతలు అని డీబీఎస్ గ్లోబర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సంజయ్ జసోలా అన్నారు. ‘‘నేటి కాలంలో విద్యలో ఏఐని భాగం చేయడం అనేది ఒక ఎంపిక కాదు, అది ఒక తప్పనిసరి అవసరం. భారతదేశంలోని ప్రతి ప్రిన్సిపాల్ AI సాంకేతికతను అర్థం చేసుకుని, ఉపయోగించుకోవాలనేదే మా లక్ష్యం’’ అని అన్నారు. ఒక ప్రిన్సిపాల్‌ను గౌరవించడం అంటే, వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గౌరవించడమేనని NFIS, AIPA జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నవదీప్ భరద్వాజ్ అన్నారు. 500 మందికి పైగా ప్రిన్సిపాల్స్ ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని చెప్పారు. దేశ నిర్మాణంలో విద్యే అత్యంత కీలకమైన మౌలిక వసతి అని మోహిత్ అగర్వాల్ అన్నారు. ప్రతి విజయవంతమైన విద్యా సంస్థ వెనుక ఒక ప్రిన్సిపాల్ కృషి ఉంటుందని.. ప్రిన్సిపాల్స్ దేశ భవిష్యత్తుకు నిజమైన శిల్పులు అని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ ఎప్పుడూ జ్ఞాన భూమి అని.. ఉపాధ్యాయులందరూ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను పునికిపుచ్చుకుని, పాఠశాలలను భవిష్యత్తు వైపు నడిపించాలి అని ఏఐపీఏ డాక్టర్ అమిత్ సెహగల్ తెలిపారు.

Follow Us