
హైదరాబాద్, మే 12: దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-2025) పరీక్షలు రేపట్నుంచి (మే 13) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. మే 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాఫ్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ- యూజీ పరీక్షను నిర్వహిస్తోంది.
సీయూఈటీ (యూజీ) 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల గడువు సోమవారం (మే 12)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువును ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మారుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెగ్యులర్ గ్రూపులతోపాటు వృత్తివిద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు 040 23328266 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
తెలంగాణ ఐసెట్-2025 దరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తుది గడువు ముగింపులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు 62,642 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటించిన మేరకు దరఖాస్తు గడువు మే 10 (శనివారం)తో ముగియగా.. మరోసారి గడువును పెంచారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.