
హైదరాబాద్, అక్టోబర్ 30: సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీయే విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 18వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఎన్టీయే తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేస్తే.. అప్లికేషన్ సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. గురువారం (అక్టోబర్ 30) నుంచి నవంబర్ 1 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో తప్పులు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే అభ్యర్ధులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామాను మాత్రం సవరించడానికి ఎలాంటి వీలు లేదని స్పష్టం చేసింది.
కాగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ 2025 పరీక్షలో అర్హత సాధించిన వారికి సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం ఇస్తుంది. జేఆర్‌ఎఫ్ అర్హత పొందిన వారికి సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ సంప్రదించవచ్చు.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ 2025 వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్స్/అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో తొలి దశ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు సంబంధిత మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఫేజ్ 1 రాత పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.