Layoffs: ఉద్యోగుల మెడపై వేలాడుతోన్న ఉద్వాసనల కత్తి.. తాజాగా మరో టెక్‌ దిగ్గజం. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది?

|

Dec 11, 2022 | 6:33 AM

ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ. వచ్చే ఏడాదిలో ప్రపంచం ఎప్పుడూ చూడని స్థాయిలో ఆర్థిక మాంద్యం పొంచిఉందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతుండడం ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది...

Layoffs: ఉద్యోగుల మెడపై వేలాడుతోన్న ఉద్వాసనల కత్తి.. తాజాగా మరో టెక్‌ దిగ్గజం. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది?
Intel Layoffs
Follow us on

ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ. వచ్చే ఏడాదిలో ప్రపంచం ఎప్పుడూ చూడని స్థాయిలో ఆర్థిక మాంద్యం పొంచిఉందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతుండడం ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన యాపిల్, మెటా, అమెజాన్‌, ట్విట్టర్‌ వంటి కంపెనీలు లక్షలాది మందిని ఇంటికి పంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్‌ 9 వరకు తీసేసిన ఉద్యోగుల సంఖ్య 2,18,324గా ఉంది. ఉద్యోగుల తొలగింపు అమెరికాలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను తొలగించడమే పనిగా పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ కూడా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.

చిప్‌మేకర్‌ ఇంటెల్‌ ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను మూడు నెలల జీతం లేని సెలవులతో ఇంటికి పంపిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్‌ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ తొలగింపులు 2023 జనవరి 31 నుంచి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందని సమాచారం.

ఇంటెల్‌ సీఈవో పాట్‌ గెల్సింగర్‌ మాట్లాడుతూ.. ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్‌ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం పొంచి ఉందన్న కారణంతో 853 కంప్యూటర్ సంస్థలు దాదాపు 1,37,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..