CGPDTM Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 553 పేటెంట్‌ ఎగ్జామినర్‌ పోస్టులు.. డిగ్రీ అర్హత..

న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్..

CGPDTM Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 553 పేటెంట్‌ ఎగ్జామినర్‌ పోస్టులు.. డిగ్రీ అర్హత..
CGPDTM

Updated on: Jul 10, 2023 | 1:50 PM

న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ (గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే వారి వయసు ఆగస్టు 4, 2023వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆగస్టు 4, 2023వ తేదీ వరకు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి చెందిన వారు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.500లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విభాగాలు..

బయో-టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బయో-కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఎంపిక విధానం ఇలా..

ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ సెప్టెంబర్‌ 3, 2023వ తేదీన నిర్వహిస్తారు. మెయిన్స్‌ అక్టోబర్‌ 1, 2023న ఉంటుంది. మెయిన్స్‌ ఫలితాలు అక్టోబర్‌ 16న విడుదలవుతాయి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us