CCL Recruitment:ఐటీఐ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

|

Sep 10, 2022 | 6:40 AM

CCL Recruitment:ఐటీఐ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL) రాంచిలో...

CCL Recruitment:ఐటీఐ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Ccl Jobs
Follow us on

CCL Recruitment:ఐటీఐ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL) రాంచిలో ఈ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 635 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సెక్రటరేయల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, డ్రెస్సర్‌, వైర్‌ మ్యాన్‌, సర్వేయర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెబ్‌ పేజ్‌ డిజైన్, వెల్డర్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రెంటిస్‌ పోస్టు ఆధారంగా పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు, ఫ్రెషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..