CBSE Revised Date Sheet 2024: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

|

Jan 05, 2024 | 2:00 PM

10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైం టేబుల్‌లో బోర్డు తాజాగా కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. దీంతో మారిన తేదీలతో బోర్డు మరోమారు కొత్తగా..

CBSE Revised Date Sheet 2024: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
CBSE
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 5: 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైం టేబుల్‌లో బోర్డు తాజాగా కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. దీంతో మారిన తేదీలతో బోర్డు మరోమారు కొత్తగా టైం టేబుల్‌ విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో మారిన టైం టేబుల్‌ను చూసుకోవచ్చని సూచించింది.

ముందుగా ప్రకటించిన 10వ తరగతి షెడ్యూల్‌ 2024 ప్రకారం.. ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి బోర్డు మార్చింది. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించనుంది.12వ తరగతిలో కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు.

దో తరగతి, 12వ తరగతి పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతాయి. కొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12.30 గంటలకే ముగుస్తాయి. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్‌, జాతీయ ప్రవేశ పరీక్షలు వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బోర్డు కొన్ని సబ్జెక్టుల మధ్య గ్యాప్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల రివైజ్డ్‌ షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి.

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల రివైజ్డ్‌ షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.