Good News! CTET December 2021 ఫలితాలు విడుదల.. ఎంత మంది అర్హత సాధించారంటే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2021కు సంబంధించిన ఫలితాలను బుధవారం (మార్చి 9)న విడుదల చేసింది..

Good News! CTET December 2021 ఫలితాలు విడుదల.. ఎంత మంది అర్హత సాధించారంటే..
Cbse Ctet Results

Updated on: Mar 10, 2022 | 7:43 AM

CTET December 2021 result out: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీటెట్‌ అభ్యర్ధులకు ఎట్టకేలకు ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2021కు సంబంధించిన ఫలితాలను బుధవారం (మార్చి 9)న విడుదల చేసింది. CBSE CTET 2021 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో చెక్‌ చేసుకోవచ్చు. కాగా సీటెట్‌ 2021 డిసెంబర్ పరీక్షలు గతేడాది డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు జరిగాయి. ఆన్సర్‌ కీ విడుదలయ్యాక అభ్యంతరాల సౌకర్యాన్ని కూడా కల్పించింది. రెస్పాన్స్‌ షీట్ల ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తుది ఫలితాలను సీబీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో పేపర్ 1కు18,92,276 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. వారిలో 14,95,511 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం 4,45,467 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఇక పేపర్ IIకి 16,62,886 మంది అభ్యర్థులు నమోదుచేసుకోగా, వారిలో 12,78,165 మంది హాజరయ్యారు. వీరిలో 2,20,069 మంది పరీక్షలో అర్హత సాధించినట్లు సీబీఎస్సీ ఈ సందర్భంగా ప్రకటించింది. కాగా ఏడాది జరగనున్న పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని 7 నుంచి జీవితకాలానికి పొడిగిస్తూ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే చాలు.. జీవితకాలంపాటు సెంట్రల్‌ స్కూళ్లలో టీచర్‌ ఉద్యోగాలకు ఆ సర్టిఫికేట్‌ పనికొస్తుందన్నమాట.

Also Read:

Attention! మెడికల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! నీట్‌ యూజీ 2022 పరీక్షలో ఆ నిబంధన ఎత్తివేస్తూ కేంద్రం కీలక ప్రకటన..