CBSE 10th Exam 2021: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షలపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు 12 తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నామని.. జూన్‌లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
ఇదిలాఉంటే.. సీబీఎస్ పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన తరుణంలో.. వారిని ఎలా ప్రమోట్ చేస్తారు. ఎలా ర్యాంకులను నిర్థారిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా ఒకేవేళ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తే.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పదో తరగతి బోర్డు ఫలితాలను విద్యార్థుల ఆబ్జెక్టివ్ నైపుణ్యాల ఆధారంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాతిపదికన కేటాయించిన మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందకపోతే.. పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
అంతకుముందు సీబీఎస్ఈ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 జూన్ 15 మధ్య జరగతాయని పేర్కొంది. మే 4 నుంచి జూన్ 7 వరకు 10 వ తరగతి పరీక్షలు, మే 4 మరియు జూన్ 15 మధ్య 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ విజృభిస్తున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకత మధ్యలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమీక్షించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని సూచించారు.
Also Read: