CBSE Class 10 Results 2026: సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. స్కోర్ పెరుగుతుందా?

CBSE 10th Second Board Result Date Time 2026: సీబీఎస్ఈ 10వ తరగతి రెండవ బోర్డు ఫలితాల 2026ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా మే 15 నుంచి మే 21 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. స్కోర్ కార్డును ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

CBSE Class 10 Results 2026: సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. స్కోర్ పెరుగుతుందా?
CBSE Class 10 Second Board Results

Updated on: Jun 17, 2026 | 1:06 PM

హైదరాబాద్‌, జూన్‌ 17: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి రెండవ బోర్డు ఫలితాల 2026ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా మే 15 నుంచి మే 21 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లైన cbse.gov.in లేదా cbseresults.nic.in లలో ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2026 జూన్‌లో వీటి ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. అయితే బోర్డు ఇంకా సెకండ్‌ బోర్డు పరీక్షల ఫలితాల తేదీ, సమయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. విద్యార్థులకు వారి స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి అదనపు అవకాశాన్ని కల్పించేందుకు ఈ ఏడాది నుంచి రెండవ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంది.

సీబీఎస్ఈ 10వ తరగతి రెండవ బోర్డు పరీక్షల ఫలితాల 2026 స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • CBSE 10వ తరగతి రెండవ బోర్డు ఫలితం 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రోల్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడిని నమోదు చేయాలి.
  • అనంతరం సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై స్కోర్ కార్డు ప్రత్యక్షమవుతుంది.
  • భవిష్యత్ ఉపయోగం కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.

కాగా ఏడాది జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి రెండో బోర్డు పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారు 6.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి దశలో సాధించిన స్కోర్‌లను మెరుగుపరుచుకోవడానికి అభ్యర్థులకు అదనపు అవకాశం కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహించారు. ఇక ఏప్రిల్ 15, 2026న సీబీఎస్ఈ 10వ తరగతి తొలి దశ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం ఈ పరీక్షకు మొత్తం 24,83,479 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 24,71,777 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులలో 23,16,008 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి అదనపు అవకాశం కల్పించేందుకు 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష నిర్వహించబడింది. వీటి ఫలితాలు వెలువడితే అభ్యర్థులకు వారి సబ్జెక్టుల వారీ స్కోర్‌లను మరింత మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది.

Follow Us