CBSE12th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ బోర్డు శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజల్ట్స్‌ను చెక్‌చేసుకోవచ్చు. తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీని ఎంటర్ చేసి స్కోరుకార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్ , పరీక్షా సంగమ్ వెబ్ సైట్ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు కాగా టర్మ్ -1, 2 పరీక్షలు రెండింటిలోనూ వచ్చిన మార్కుల వెయిటేజీ ఆధారంగా CBSE ఫైనల్ మార్క్ షీట్ రానుంది. ఇందులో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ పరీక్షలు అలాగే ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్ మార్కుల వివరాలను పొందుపరచనున్నారు.
Central Board of Secondary Education (CBSE) announces Class 12 results pic.twitter.com/tt5h3AgEup
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 22, 2022
బాలికలదే పైచేయి..
కాగా ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12 తరగతి పరీక్షల కోసం 14, 44, 341 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం14,35,366
మంది పరీక్షలు రాయగా13, 30, 662 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 92.71గా నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. కాగా మొదట సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బోర్డు ఈ వార్తలను ఖండించింది. ఎట్టకేలకు ఈరోజు ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
CBSE Class 12 results | Girls outshine boys with overall pass percentage of 94.54%, while boys secured 91.25% pic.twitter.com/cZqXQEyfAp
— ANI (@ANI) July 22, 2022
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..